జీవితం..
జీవితం..
ఇంతకు మునుపల్లే...
మౌనంలో ఉంటేనే బాగుంది...
లోలో ఒత్తిడిని అణిచేస్తేనే బాగుంది...
నాలోనేనే నాతోనేనే ఊసులాడుకుంటేనే బాగుంది...
నిను చూసిన తరుణం...
లావాలా ఉబికింది మమత...
దావానలమై వ్యాపిస్తుంది మదిని..
కార్చిచ్చై దహిస్తుంది మేనుని...
తెలియని అయోమయం...
పూడ్చలేని అగాధం...
తీర్చలేని ఋణానుబంధం...
సాగించలేని అనుబంధం...
ఆపలేని పయనం...
దిక్కు తోచని అరణ్యం...

