ప్రకృతి కళా...
ప్రకృతి కళా...
మంచుపూల వర్షం...........
పెంచుతోంది హర్షం...........
అల్లిబిల్లి ఆశలేవో............
పల్లవించె ఈ వేళ............
జావళీలు పాడుకుంటూ.............
ఉద్భవించెనే నేల..............
కొంటె కిరణమాల..............
వేసుకున్నది పుడమి అలా...........
జంట కోరు లీలా............
ఉదయమల్లె తరిమింది...........
నిశిని మరలా........
వాయిదా లు వద్దు అన్న కలలా............
హాయి పరదాలు పరచిన రాత్రిని వీడుకోలు.........
పలుకుతున్నదే పగలిలా............
వచ్చి వాలుతున్న ఊహలా.............
మెచ్చుకోలు కోరుతున్న కొత్త రోజిలా............
నచ్చుతోంది ముద్దుగున్న ప్రకృతి కళా...........
గిచ్చుతున్నది మనసుకి మల్లెలా.............

