ఓ ప్రాణ సఖీ
ఓ ప్రాణ సఖీ
నా ఆశాకాశ పూర్ణచంద్రముఖీ ఎన్నో అభివర్ణించిన
వాచస్పతిని నేడు మన దూరాన్ని వివరించలేక పోతున్నా..
ఎన్నోన్నో అనుభవించిన కళామతిని నిన్ను
అభినయించలేకపోతున్నా..
శ్రీకార శిఖరాల మీద నా ఆత్మానుభూతిని ఎగరవేయడానికి
నేనే ఓ బావుటాన్నై..
నీ సరళవక్ర రేఖాగణిత గుణిత జనిత అగణిత రూపాలను
అవగాహన చేసుకుంటున్నాను..
కాలాన్ని నా కన్నులలో మోడ్చి అనంతాకాశం వైపు శిరస్సెత్తి
ఎదురుచూస్తున్నాను లిప్తపాటులోనైనా నీ రూపం
దరసించుననే విశ్వాసముతో..!!

