నవ్వపారిజాతాలు
నవ్వపారిజాతాలు
నవ్యపారిజాతాలకు..చోటిచ్చును తననవ్వే..!
నా గుండెను ఒకలీలగ..మంత్రించును తననవ్వే..!
బొమ్మగీయు కుంచెకెంత..ఉత్సాహం నింపిందో..
నాభావన మాటునిలచి..విరబూయును తననవ్వే..!
విరహానికి రెక్కలిచ్చి..సాయమెలా చేసిందో..
మదిలోపలి మదనునిమతి..పోగొట్టును తననవ్వే..!
పరిమళాల సునామీలు..వస్తాయని తెలియదులే..
చూపలేని విషాదాన్ని..తరిమేయును తననవ్వే..!
గులాబీల గుసగుసలకు..ఊపిరులే ఊదేనా..
మనసుపట్టి చైత్రవనిగ..మార్చేయును తననవ్వే..!

