STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

మౌనమ్ర

మౌనమ్ర

1 min
2


మౌనామ్ర రసమునే..వడ్డిస్తు ఉన్నావు..! 

హృదిలోన చిరునవ్వు..వెలిగిస్తు ఉన్నావు..! 


కోరికల చెట్టుపై..కుహుకుహుల వాణివో.. 

కలలింట వెన్నెల్లు..కాయిస్తు ఉన్నావు..! 


మాటలే మల్లెలై..పరిమళించే వేళ..

సరిగమల నాదమై..ప్రవహిస్తు ఉన్నావు..! 


ఏ మెఱుపు వనసీమ..నీదు పుట్టినిల్లో.. 

నాభావ గగనాన..నర్తిస్తు ఉన్నావు..! 


నిజవిరహ వీణియను..మీటేవు తియ్యగా.. 

ఏకాంత సీమకే..నడిపిస్తు ఉన్నావు..!


పరితాప మదితీర్చు..ముగ్ధ మోహిని రూపా.. 

నీ చూపు టూయలన..మురిపిస్తు ఉన్నావు..!


Rate this content
Log in

Similar telugu poem from Romance