తొలుగుతున్నా చీకట్లు
తొలుగుతున్నా చీకట్లు
అజ్ఞానమనే అంధకారంలో
మునిగిపోయిన వారికి
సన్మార్గంలో నడిపే గురువులు
జ్ఞానం అనే వెలుతురు నివ్వగా
అజ్ఞానం అనే అంధకారం
కనుమరుగయ్యెనుగా
ఉషోదయవేళ మాయమైన తిమిరమువోలే
పేదవారి బ్రతుకుల
ప్రభుత్వ సంక్షేమ పధకాలు
ప్రజారంజక పాలన
వారి జీవితంలో నింపే
వెలుగు మతాబులు
బాధలనే చీకట్లు తొలగిపోవ
ఆధునికత సంతరించుకున్న
నేటి కాలంలో
సూర్య కాంతిని
నిక్షిప్తం చేసుకుని
వెలుగులు పంచే దీపాలు
రాత్రి వేళలయందు
చీకటి కనుమరుగవ్వులాగున
పట్నవాసులకు
కనిపించదే చీకటి
దివారాత్రములు
విద్యుత్ దీపకాంతులతో

