తన మనసే
తన మనసే
నిత్యప్రేమ కర్పూరపు..రాశి కదా తన మనసే..!
ఒక తీరని వ్యాకులతా..నగరి కదా తన మనసే..!
నిట్టూర్పుల పర్వానికి..పట్టపగలు నిశిగ మారె..
అర్థరహిత మోహానికి..జోడి కదా తన మనసే..!
దాడిచేయు శక్తులేవి..లేవు నిజం ఆశ్చర్యం..
భయపడుతూ పారిపోవు..పక్షి కదా తన మనసే..!
చెలిమిపూల తోటంటే..ఉండదుగా వేరేగా..
పరిమళించు ఒక వెన్నెల..వాటి కదా తన మనసే..!
ఊరు వాడ లేకమైన..జవాబివ్వ లేవు చూడు..
దివ్య మౌనగగన ఘనాపాటి కదా తన మనసే..!

