వారెవ్వరు
వారెవ్వరు
నీటిబొట్టు విలువ సరిగ..తెలుసుకున్న వారెవ్వరు..!?
దు:ఖమనే అగ్నిజలధి..ఆర్పుకున్న వారెవ్వరు..!?
హృదయమేగ నిజపూజా..మందిరమా ఇంకెక్కడ..
దైవకోటి లోలోపల..చూసుకున్న వారెవ్వరు..!?
అందమైన లోకంలో..వెదికేరా స్వర్గమేదొ..
కులమతాల నరకాలను..కాల్చుకున్న వారెవ్వరు..!?
చెలిమివనము మది విరియక..కలిగేనా సమభావన..
ఆనందపు బాష్పనిధిని..అందుకున్న వారెవ్వరు..!?
సంతసాల మధుశాలయె..మనసు కదా గమనిస్తే..
ఆందోళనలన్ని వదిలి..ఊరుకున్న వారెవ్వరు..!?

