బంధం
బంధం
బంధాలు ఆత్మీయతలు
ఇంకిపోయాయి
పల్లెటూర్లలో ఉట
బావుల్లా,
పండుగకో పబ్బనికో
పొంగిపోర్లుతాయి
వరద వాగుల్లా,
గుమ్మడి తీగలా
అల్లుకున్న ఉమ్మడి
కుటుంబాలు
సోదిస్తే కనిపిస్తాయి
ఎడారిలో మొక్కల్ల,
పశు సంపదుంటే
పసిడున్నట్లే రోజులు
కనుమరుగై
పరువు పోయిన
పసిడి కావాలే
అనే రోజుల్లో బ్రతుకుతున్నాం
మెతుకు కోసం బ్రతుకు
పోయే మెప్పు కోసం
అప్పులాయ
రంగురంగుల రోజుల
కంటే రంగులు మార్చే
మనుషులు ఎక్కువాయే.

