గులాబీ నీవా
గులాబీ నీవా
మనసే దోచిన.. గులాబి నీవా..!
మధువుగ మిగిలిన.. గులాబి నీవా..!
అద్భుత పరిమళ రాశివి..చెలియా..!
నా మది నిలచిన..గులాబి నీవా..!
విరహపు జ్వాలను చల్లార్చేవా..!
మనసా వలచిన..గులాబి నీవా..!
జన్మల గొడవలు మాన్పే సఖియా..!
తోటను దాటిన.. గులాబి నీవా..!
చిరునగవులకే..శ్వాసగ వెలిగే..
శక్తిని మించిన..గులాబి నీవా..

