STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy

విరహపు అలలు

విరహపు అలలు

1 min
523

లేత వంపుల యవ్వన వీణని మీటి

తియ్యని కోరికల రాగాన్ని పలికించి

సడి చెయ్యని ఎదలో అలజడి రేపావు


నా దేహాన్ని మబ్బులా కమ్ముకున్న 

నీ దేహా పరిమళం నా ముక్కును వదిలి పోలేదు

నీవు విసిరిన చూపులకు,నా కనులకు కునుకులేదు

నీ చిలిపి సరసపు సరిగమలు 

నా చెవులను వదలట్లేదు

నీ అధర మధురామృతం కోసం 

నా జిహ్వ జివ్వుమంటుంది.....

నా తనువు విరహపు అగ్ని జ్వాలలో

నీ వెచ్చని కౌగిలి కోరుకుంటుంది


ఉదయాలు ఉక్కపోతలో ఉడికిపోతుంది

వయసు చీకటి సెగలో చలి కాచుకుంటున్నది

జాము రాతిరిలో తీరని ఆశలకు జాగరణ చేస్తున్న

వెన్నెలలో వన్నెలపూలు మకరందాన్నీ

ఎగజిమ్ముతున్నవి

అనువణువు వాంఛలతో నా తనువు

 ప్రళయతాండవం చేస్తుంది

నా మనసంతా తన్మయత్నంతో తగలబడుతుంది 


కాంక్షల కొలిమిలో కాలి గాలిలాగా వస్తున్నాను

నీ తలపులను తడిమి చూసి నీ భావాల 

రంగులను ఇంద్రధనస్సుగా సారిస్తా

నీ యదపై బంధినై యుద్ధం చేసేస్తా

నీ మనస్సు పొరలు చీల్చుకొని

నీ లోకి నేను విరహపు అలనై ప్రవహిస్తా

నీ గుండె నది అడుగులో ఆటు పోట్లను పుట్టిస్తా

తావే తెలియని తీరంలో ప్రేమ ఉప్పెనలు సృష్టిస్తా 



Rate this content
Log in

Similar telugu poem from Romance