ప్రేమేనా
ప్రేమేనా
నీతో ఏదో చెప్పాలని
నాతో నేను మాట్లాడుకుంటుంటే
ఎన్నో మధుర భావనలు
ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి.
నిన్ను చూస్తూంటే...!
ఎన్నడు చూడని సరికొత్త
అందాన్ని చూస్తున్న భావన
ఆనందంగా అనిపిస్తుంది.
నిన్ను గమనిస్తూ ఉన్నప్పుడల్లా
నీ వైపుగా నా పయనం సాగితే
బావుణ్ణు అనిపిస్తుంది.
నిన్ను పలమార్లు చూస్తే....!
ఆ రోజు నా కళ్ళలో
ఆనందపు కాంతితో
లోకమంతా ఉత్సవం
జరుపుకుంటుందేమో అనిపిస్తుంది
నీ పలకరింపుల పూవానలో
తడిసే రోజు దగ్గర పడుతున్నట్టూ...
భావనల వలలో చిక్కుకుని
భావుకునిగా మారిపోయేట్టు...
నా హృదయం సంకేతమిస్తుంది
ఇదంతా ప్రేమేనా

