STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

మేరా భారత్!

మేరా భారత్!

1 min
382

మేరా భారత్!


తల్లీ..భారతి!

నీ పేరు పెదవులపై పలికిన చాలు

మనమ్మున ఇవ్వాలనిపిస్తుంది హారతి!

ఎందుకంటే..నువ్వు మా అందరి...ధరితీ!


తల్లీ భారతి...

నీకు నిత్యం దాహార్తిని తీర్చే..

జీవనదులు!

నిన్ను ఎప్పుడు చల్లగా చూసే..

హిమగిరి సొగసులు!

నీకు పచ్చదనంతో ఎంతో హాయిని ఇచ్చే..

అరుదైన అడవులు!

నీకు ఆనందాన్ని ఇస్తూ...

హాయిగా ఆడుకొనే..

జంతు జాలం పశు పక్ష్యాదులు!


లాంటి..యెన్నో

మంచివాటిని కన్న భూమివమ్మా

మానవులకు జన్మనిచ్చి..

కర్మ భూమివైనావమ్మా!


యెన్నో వేల యేళ్ళుగా..

సిరిసంపదలతో..కళకళలాడే

తల్లీ భారతి నిన్ను...

ఎందరో..విదేశీయులు వచ్చి

ఖండ ఖండాలుగా చీల్చి...

సిరి సంపదలును కొల్లగొట్టుకు పోయారు!


ప్రతిసారీ...

నీ పాలు తాగిన దేశభక్తులు ఎందరో..

వారి ప్రాణాలను పణంగా పెట్టి..

నిన్ను కాపాడారు!

ఎందుకంటే...స్వేచ్ఛ కోసం

నా సొంత ఇంట్లో నాకు స్వేచ్ఛ లేకపోతే..

మా బతుకు ఎందుకు అని!


మరి ఈ రోజు..

ఆ స్వేచ్ఛ..ఎవరికీ ఉందో..

తెలుసా.. తల్లీ భారతి!


నోట్ల కట్టలను తినేసే పందికొక్కులకి

భూమిని మింగేసే.. భూ భకాసురలకి

నడి రోడ్డుపై మనుషలని నరికే..

రాక్షస జాతికి..

మగువల మాన ప్రాణాలను హరించే..

మద మృగ జాతికి..

వారికి..వారికి మాత్రమే..ఉంది..

స్వేచ్ఛ..వారికి మాత్రమే తీరుతుంది ఇచ్చ!


హద్దులు లేని స్వేచ్ఛ..

అవధులు లేని ఇచ్చ..

చేస్తుంది వారి జీవితాలనే..రచ్చ..రచ్చ


తల్లీ భారతి..

ఎందరో శ్రమజీవులు..

హాయిగా సేద తీరుతున్నారు అంటే...

అందుకు..నీ చల్లని ఒడే..కారణం

తల్లీ భారతి..

ఎందరో పేదలు..

భద్రంగా..బతుకుతున్నారు అంటే

అందుకు..నీ నీడ లో ఉండటమే కారణం

తల్లీ భారతి...

నీ కడుపున పుట్టినందుకు..

ప్రతి భారతీయుడు..ఎంతగానో

గర్వ పడతాడు ఎందుకో తెలుసా..

నీవిచ్చిన..ఆత్మీయత

నీవిచ్చిన..ప్రేమ

నీవు నేర్పిన..నైతికత

నీవు నేర్పిన కుటుంబ విలువలు

నీతో ఏర్పడిన..బంధం అంత గొప్పది

తల్లీ..భారతి!

   

     .....రాజ్......



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action