నిన్ను నాలో మోస్తున్న!
నిన్ను నాలో మోస్తున్న!
నువ్వే...గుర్తొస్తున్నావే...నన్నే నే మరిచేంతలా
క్షణమైనా తీరిక లేదే...నీ తలపుల పనిలోనా
నీ పరిచయమెలాగ...జరిగిందో గుర్తొస్తుంటే నవ్వొస్తుంది
నువ్వు లేని ఆలోచనలే...ప్రతి ఘడియ నన్నే ఏడిపించెనే
నిన్ను నాలో మోస్తున్న...ఏం చేస్తున్నావో...నేస్తం అని
ప్రేమంటే నమ్మకమో కాదో... తెలియదు కానీ
తెల్లని నవ్వుల జలపాతంలో...నాలో దుఃఖం కడిగేసే
నీ చెలిమే నా ప్రేమని ఆనందిస్తున్న
ఊహల ఊసుల బాసలతో... నీతో తెగ మాట్లాడేస్తూ
నన్నే నీ ముందు పరిచేశా... స్వీకరించుట నీ ఇష్టం నేస్తం
జ్ఞాపకమొచ్చే గతానివైతే...అసలేకావులే
గుండెలో... దాగిన ఎల్లలు లేని ఎలిమే నువ్వులే