STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

భరత జాతి నిర్మాత!

భరత జాతి నిర్మాత!

1 min
455

రాజ్యాంగ నిర్మాత....

(బురద నుండి పుట్టిన కమలానివి కాదు)


బడుగు..

బలహీన వర్గాల..

తల రాతను మార్చి రాసిన.. ఓ విధాత!


నిశీధి ని గర్జించే..

నిప్పు కణిక లా!

ఎడారి ని ఎదిరించే..

నీటి ఊట లా!

అగమ్య గోచరంగా ఉన్న..

నడి సంద్రాన నావ లా!


భరత జాతి లో వందల ఏళ్ళుగా..

అణగ ద్రొక్కబడిన..

వెనుకబడిన తరగతి ప్రజలకు..

సమానత్వం అనే..వెలుగును..

ప్రసాదించిన .. ప్రధాత!

ఓ.. అంబేడ్కరా!


బురదలో నుండి

కమలం వికసించినట్టు..

అని సంభోదిద్దాం అంటే!


ఆ నాటి..

మన సమాజం తయారు చేసిన

అంటరాని వాళ్ళు ..

బురద అంత గొప్ప వాళ్ళు అవుతరేమో

అని సంకోచం!


ఎందుకంటే?


ఆ నాటి సమాజం

బురదనైనా తాకింది 

కానీ!

తోటి మానవ రూపాన్ని

తాకలేని దీనావస్థలో వుంది!


కాబట్టి!

ఓ అంబేడ్కరా! నీవు..


బురద నుండి పుట్టిన 

కమాలానివి కావు!

మా కోసం...పుట్టిన..

నిజమైన మనిషివి!


ఓ అంబేడ్కరా!

విద్యార్ధి గా నీవెదుర్కున్న..నిందలు!

ఉద్యోగిగా నీవు భరించిన..అవమానాలు!

నీలాంటి వారినెందర్నో..

మనుషులుగా చూడని

ఆ నాటి అంధ సమాజాన్ని..నిందించక!


మొక్కవోని దీక్షతో

విద్య అనే ఆయుధం తో

నీ ఉన్నతిని సాధించి


నీ జాతికే కాదు..

భరత జాతి ఉన్నతికి...

రాజ్యాంగం అనే..అద్భుత దీపికను

దేశానికి ఇచ్చిన... దార్శనికు డా!

ఓ... డా. బి.ఆర్.అంబేడ్కరా!


నీవు అస్రృశ్యులకు మాత్రమే..

ఆణి మత్యానివి కాదు!

ఈ...

భరత జాతికే..భాస్కరుడు వి!


            .......రాజ్.....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action