STORYMIRROR

Jyothi Muvvala

Tragedy Action Inspirational

4  

Jyothi Muvvala

Tragedy Action Inspirational

శీర్షిక : కన్నీళ్ళ వాన

శీర్షిక : కన్నీళ్ళ వాన

1 min
325


చిక్కటి ఎర్ర రంగు శరీరాన్ని చీల్చివరదలై పారుతుందిసలసల మరుగుతూన్యాయం కోరుతూ... 

కర్తవ్య పాలనలో ఒకరుఆశయ సాధనలో మరొకరుఅన్నదమ్ములైనాఆగర్భ శత్రువులైతూటాకు బలి అవుతూ...

చట్టాల చట్రంలో విధి అనే భ్రమలో దుర్మార్గాన్ని దూరం చేయాలనిఅన్యాయాన్ని అంతం చేయాలనిఎవరికివారు రాసుకున్న రాజ్యాంగంలోబలైపోయిన జీవులు!

బిడ్డలు వీరమరణం పొందిన ప్రతిసారిదాత్రి పుట్టెడు దుఃఖంతో విలపిస్తుందిఆ వీరుల మృతదేహాలను చూసిమేఘాలన్నీ ఒకచోట చేరి సంఘీభావం తెలుపుతున్నట్టుకన్నీళ్ళ వానతో....తుది వీడ్కోలు పలుకుతున్నాయి !!

✍️ జ్యోతి మువ్వల 


Rate this content
Log in

Similar telugu poem from Tragedy