కారణం ఎవరు?
కారణం ఎవరు?
వర్ణ వ్యవస్థకు కారణం ఎవరు
కులవ్యవస్థకు కారణం ఎవరు
సంప్రదాయాలకు కారణం ఎవరు
అణచివేతకు కారణం ఎవరు
అంటరానితనానికి కారణం ఎవరు
అసమానతలకు కారణం ఎవరు
మాతృసౌమ్యం మరుగున పడటానికి కారణం ఎవరు
పితృసౌమ్యం ప్రవేశపెట్టిందెవరు
స్త్రీ బానిసత్వానికి కారణం ఎవరు
బాల్య వివాహాలకు కారణం ఎవరు
కన్యాశుల్కనికి కారణం ఎవరు
సతి సహగమనానికి కారణం ఎవరు
వైధవ్యం ఆచారాన్నీ అంటగట్టింది ఎవరు
మూఢ విశ్వాసాలకు కారణం ఎవరు
దేవుడు దెయ్యం బ్రమలకు కారణం ఎవరు
కర్మకాండలకు పిండ ప్రదానాలకు కారణం ఎవరు
మోక్షం ,పునర్జన్మ, స్వర్గ, నరకాలకు కారణం ఎవరు
శూద్రులకు చదువును దూరం చేసిందెవరు
పంచమ కులాన్ని పుట్టించిదేవరు
అస్పృశ్యతను పాటించెదవరు
సమాజాన్ని అజ్ఞానం వైపు నెట్టింది ఎవరు
ఈ దేశాన్ని శాస్త్రీయంగా ఎదగానీయకుండా చేసిందెవరు
సంపదను కొద్దిమందికే దక్కేలా శాసనాలు చేసిందెవరు
దేశ సమైక్యతను దెబ్బ తీసిందేవరు
సంస్కృతిని సంస్కరించుకొని హీనుడు ఎవరు
గతంలోనే బతుకుతున్నది ఎవరు
అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కరే..
