STORYMIRROR

ARJUNAIAH NARRA

Tragedy

2  

ARJUNAIAH NARRA

Tragedy

భక్తి భారత్ విముక్తి భారత్

భక్తి భారత్ విముక్తి భారత్

1 min
276


వర్ణం, కులం, అంటరానితనం, అస్పృశ్యత

సంప్రదాయం, ఆచారాలు, కట్టుబాట్లు, 

అజ్ఞానం, మూఢవిశ్వాసం, స్వర్గం, నరకం 

భక్తి పిచ్చితో నా దేశం రోగగ్రస్తమైంది

ఔషదంలేని రోగం రొచ్చూలో కొట్టుకుంటుంది

దేవుడనే భ్రమలో, మతమనే మత్తులో కూరుకుపోయి 

ప్రపంచం వర్తమానంలో నడుస్తుంటే

నా దేశం గతంలోకి నడుస్తున్నది


కళ్ళముందు ప్రాణం విలవిలాడుతున్న

ఆకలి అక్రందన రోధనలు వినబడుతున్న

మతం పేరిట మారణ హోమం జరుగుతున్న

దేశభక్తి పేరుతో లూటీలు చేస్తున్న

మతం మత్తులో మానవత్వం మరిచి

భక్తి రసం వెల్లువై మురికి కాలువలల్లో పారుతున్నది 


పసిపాప పాలకు గుక్కబట్టి ఏడుస్తుంటే

క్షిరాభిషేకాలు చేస్తు పాలసంద్రంలో పవళించాడట

బడిలేక చదువులేక అజ్ఞానంతో, 

మూఢవిశ్వాసలతో దేశం వెనుకబడి పోతుంటే 

గుడి, మసీదు, చర్చిలు కట్టి దేశ శ్రేయస్సు గొప్పదంట


సాటి మనిషి జానెడు గూడు కోసం

పిడికెడు మెతుకుల కోసం, కనీస బట్టల కోసం

ఆస్పత్రిలో అక్షిజన్ కోసం పోరాడుతుంటే

రికార్డ్ బద్దలు కొట్టే భారీ విగ్రహాల ఏర్పాటుకు వెంపర్లాడుతుంది ఈ దేశం


 స్మశానాల వాటికలు వెలిగిపోతున్నాయి

గంగా కరోన మృతదేహాలతో పరవళ్లు తొక్కుతున్నది

దేశానికి ఆక్షిజన్ లేక ఊపిరాడక అశువులు బాస్తున్నా

దేవుళ్ళు దేవతలు, గుడులు, గోపురాలు, చర్చిలు

మసీదులు తాళాలతో ద్వారాలు ముసుకున్నవి

బాబాలు, పూజారులు, మొల్లాలు, ఫాధర్లు కానరారూ

పూజలు, నామాజులు, ప్రార్థనలు పనిచేస్తాలేవు


కరోనని తరిమి కొట్టే పనిలో నిరంతరం

చావుని లెక్కచేయకుండా  చిత్తశుద్ధితో

ప్రభుత్వం, డాక్టర్లు, నర్సులు, పోలీసులు 

ప్రజల ప్రాణాలని రక్షిస్తూ, మానవుడే కేంద్రమని

మానవుడే మాహాత్ముడంటు, 

మానవుడే దేవుడంటు

మానవ సేవే మాధవ సేవ అని

మానవత్వమే మనిషి మతమని చాటుతున్నా

ప్రతి ఒక్కరి పాదాలకు పాదాభివందనం....

(ఈ తరం గొప్ప మానవతా వాది సోను సూద్ గారికి ప్రత్యేక పాదాభివందనం)








 




Rate this content
Log in

Similar telugu poem from Tragedy