STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Action

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Action

నీ.. ఊహల... బందీని...

నీ.. ఊహల... బందీని...

1 min
424


 ప్రియతమా....

నా ప్రాణమా..


ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..

స్వచ్ఛమైన ప్రేమ దొరకడం అదృష్టం..


ప్రేమ ఒక తపస్సు

ప్రేమ ఒక అగ్ని కణిక

ప్రేమ అద్భుతమైన భావన

ఆత్మానందాన్ని ఇచ్చే అలౌకిక భావం ప్రేమ..

ఆకాశంలో హరివిల్లు ప్రేమ..


ప్రియా,


 నీ ప్రేమలో అంబరాన్ని తాకిన ఆనందం

గగన వీధిలో అలుపెరగ

విహారించిన అందమైన గువ్వలా 

పండు వెన్నెల్లో విచ్చుకున్న కలువలా 

ప్రకృతి ఒడిలో పచ్చని పైరు లా..

ఎంతటి మాధుర్యం అనుభవించాను..


మరి,

ఇప్పుడు ఎందుకిలా వేదిస్తున్నావ్


హృదయం పగిలి స్రవిస్తున్న

నెత్తుటి మరకలు ఎలా చూపించను


మదిలో మెదిలే నీ ఉహల ఊసులు

ఎలా వినిపించను..


 మనసులో జ్వలిస్తున్న అగ్నినీ ఎలా ఆర్పను

కన్నీటి సుడిగుండంలో కొట్టుకుపోతున్న నేను

ఏ దరి చేరను..


కనులకు నువు కానరావు..

మనసు మరొకరితో మాట్లాడదు..


 గతమంతా జ్ఞాపకమేనా..

రేపన్నది కలగానే మిగిలిపోతుంద?


నీ ప్రేమ కోసం నేను పడే వేదన వర్ణించలేను

కార్చే కన్నీళ్లు చూపించలేను.

నీ ధ్యానంలో నా ప్రాణం పోతుందేమో.


నా మనసుని మాత్రమే తీసుకెళ్ళావు అనుకున్న

కానీ ప్రాణం కూడా నీతోనే ఉంది..

ఇప్పుడు నేను కేవలం దేహం ఉన్న జీవచ్చవాన్ని మాత్రమే.😥


శ్రీ...

హృదయ స్పందన.



Rate this content
Log in

Similar telugu poem from Romance