STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

THREE..

THREE..

1 min
308

Three.. (మూడో మనిషి)


పొద్దున లేచింది మొదలు!

కెమేరా కన్నులతో..

పెదవులపై అద్దెకు తెచ్చుకున్న

చిరునవ్వులతో..

నిలకడ లేని నాలుకతో..

నటన మొదలుపెట్టి!


నడకలో.. నడవడికలో

పనిలో..పలకరింపులో

ఏకాంతంలో..కుటుంబంలో

సమూహంలో..సమాజంలో

గుడిలో..బడిలో

ఇలా ప్రతిచోట..నటనే..నటనే!


ఓ..మనిషి!

నీకున్నవి..మూడు రూపాలు!

బయటున్నది..నట రూపం!

లోనున్నది..నిజ రూపం!

మరి..ఏది మనిషి రూపం?


పరమాత్మ ఇచ్చాడో..

లేక!

అణువణువు కలిసి..

నీకు ఆయువు.. పోసాయో కానీ!

నీవు చితికి చేరేలోపు..

ఒక్కసారి ఒక్కసారైనా...

మనిషిగా.. మసలు!

అదే ..నీ మనిషి రూపం..

అతడే నీలో ఉన్న..మూడో మనిషి!


మానవత్వం..

ప్రేమ తత్వం..

విచక్షణత్వం..

కలబోసిన..

కళాత్మక ఖండం..మనిషి!

అతడే..మూడో మనిషి!


     ....రాజ్.....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action