STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

కరోనా పై విజయం : వచన కవిత : కవీశ్వర్

కరోనా పై విజయం : వచన కవిత : కవీశ్వర్

1 min
325

కరోనా పై విజయం : వచన కవిత

     : కవీశ్వర్ (prompt -29)

 కరోనా యుద్ధం ముగియలేదు - ప్రజలు తమ భయాలు వీడలేదు 

మొక్కవోని దీక్ష వదలలేదు - జాగ్రత్తలు తీసుకోవడం మానలేదు 

రెండు ఏళ్ళు గా ఇంటిని వదిలిఅత్యవసరాలకు తప్ప బయటకు రాలేదు 

పనులన్నింటిని సాంకేతికలతో ఇంటినుండే పూర్తిచేయకుండా ఉండలేదు.


వంటింటి చిట్కాలతో రోగ నిరోధక శక్తిని ఎల్లప్పుడూ పెంచకుండా నిలువలేదు 

ప్రతిసారీ నోటికి ముక్కుకి వేసే ముసుగు రక్షణ కల్పించడం మానకుండలేదు. 

చేతులతో పనిచేసి మాలినములతోపాటు సూక్ష్మ క్రిములను పారద్రోలడం మానలేదు 

ఎందుకంటే ప్రతీ సారీ చేతులను్ షాని టైజర్స్ తో హ్యాండ్ వాష్ తో కడగడం ఆపలేదు 


వైరస్ క్రిమి మనని తాకడానికి జంకేలా మనం (జనం) టీకాలను వేసుకోకుండా ఆగలేదు 

వీటన్నిటిని మనకు సహాయాన్ని సహయోగాన్ని అందించే యోధులు తమ వృత్తిని వీడలేదు 

అందుకే మన ఆరోగ్యము, సురక్షితంగా రక్షతో కరోనా బారిన చేరకుండా జాగ్రత్త పడడం ఆపలేదు 

వీటిని అనుసరించకుండా,పాటించకుండా ఉండేవారిని కరోనా కాటువేయడం కూడా మానలేదు. 


వ్యాఖ్య : " కరోనా నేర్పిన గుణపాఠాలు ,జీవన శైలి లో ఆచరణ యోగ్యమైనవిగా భావించి జాగ్రత్తగా ఉండడమే

 ముందుచూపు ఉన్న జనులకు శ్రీ రామ రక్ష " కరోనా యోధులకు మనం ఎల్లప్పుడూ అండదండలు అందించాలి.

కవీశ్వర్ .. 


 

 



 


Rate this content
Log in

Similar telugu poem from Abstract