మనసుకు
మనసుకు
ప్రేమనదీ తీరమునే..చూపినావు మనసుకు..!
నినుచూసే కన్నులనే..ఇచ్చినావు మనసుకు..!
తాపాలను దాచుకున్న..తనువు మహా తరువే..
సేదతీర్చు గంధాలను..నింపినావు మనసుకు..!
మోహవీణ ఎదలోయల..రాగసుధలు ఎన్నో..
సరసరాగ స్వరములేవొ..కూర్చినావు మనసుకు..!
ఆటలాడు మాటలింట..చేరినాను నీ దయ..
వేదనలకు పరమార్థం..తెల్పినావు మనసుకు..!
వింతనిప్పు కత్తులపై..పరుగులన్ని తప్పెను..
మెఱుపుపూల దారిసరిగ..వేసినావు మనసుకు..!
కృతజ్ఞతా గీతమొకటి..పాడుకోగ వేడుక..
యాతనలను యాతమేయ..నేర్పినావు మనసుకు..!

