వినపడని నువ్వు
వినపడని నువ్వు
అంశం: వినపడని నవ్వు
మదిలో మెదిలిన జ్ఞాపకాలు
వేదనల వేసంగిలో కాలుస్తుంటే
హృది కన్నీటి వానగా మారింది
ఎందుకనో మనసుకు ఒకటే దిగులు
ఎందుకని ఇతమిద్దoగా తెలియని అయోమయం
నిలిచిన ఈ నిశబ్దపు రేయిలో
మది మాటి మాటికి నేమరేసుకుంటు
తర్జన బర్జన పడుతోంది
అనుబంధాల ఆనవాలు ఆవిరై
బంధాలు బీటలు వారీ
మనసులు బీడుబారిన
మనుషులుగామసలుతుంటే
మనిషీ మనిషికీ మధ్య మనీ
బంధమేమిగులుతుంటే
అనురాగాలు అంటరానివిగా మారుతూ
సంబంధాలన్నీ సమాధులౌతుంటే
మనస్ఫూర్తిగా నవ్వుల్ని నవ్వని
నవ్వులే వినపడని కృత్రిమ నిశబ్దం లో
మనిషీ నేడు మనసులో తడిని
హృదిలో మమతను వెతుకుతున్నాడు
గడిచినకాలంలో ఓచెక్కు చెదరని
చిక్కని మానవత్వపు ఋతువు
మళ్లీ ప్రస్తుత కాలానికీ తిరిగొస్తే
బాగుండునని కలలు కంటున్నాడు
ఓ మానవీయ పుష్పం విరిసి పోతే
మళ్లీ మనుషుల మధ్య సంబంధాలు
సజీవాలై మమతలు మల్లెల విరులై
గుభాలిస్తే అన్న భావన యెంత బాగుంది
అపురూపమైన ఆ జీవం ఉట్టి పడే చిరునవ్వులు
జీవిత కొమ్మకు విరగ కాస్తే యెంత బాగుంటుందో
మనిషీ బాగుంటే సంఘం బాగుంటుంది మరీ

