ఆశ
ఆశ
ఈ రాత్రి బ్రతుకు పండినట్లుంది తన చంద్రుని గుండెకు హత్తుకుని
తానొదిగి తమకంలో నిద్దరోతుంది
ఇటు చూడు వేదన బల్లమీద ఓ ఆశ ఒంటరై ముఖం
దాచుకుని ఏడ్చి అలిసి బేలగా ఒదిగి కూర్చుంది
తోడు దొరకని ఆశకు ఈడు జారింది నీ జాడ కానక
తాను గోల చేసిందినీడతోనే తన గోడు చెప్పుకుంటుంది
పండి రాలిన కలలు ఏరుకుంటూ ఆశమంటకు చితుకులుగా వాడుకుంటూఆరకుండా దాన్ని చూసు కుంటుంది
తెల్లవారే లోపు ఆ కలలు సమసే లోపు ఆ ఆశ ఆరేలోపు
ఆ నెగడు అణిగేలోపు ఆ ఆశ పండేనో అడియాసై మండేనో..

