ప్రేమలేఖలా
ప్రేమలేఖలా
నువు మాట్లడుతుంటే..!
గుండె చప్పుడు అనువదిస్తున్న మాదిరే వుంది..!
కోటి నదుల సంగమ తీర్థంలో మునకలేస్తున్న విధంగా వుంది..!
నీలి మబ్బుల గుంపుల్లో నిండుతున్న....
చినుకు వీణియలను మీటుతున్నంత సొగసుగా వుంది..!
మౌనవేణువు అక్షరాలకు పల్లకి పడుతున్న తీరుగానే వుంది..!
గగనసీమలలో విహరించే కలహంసలు..
చిన్ని చేపపిల్లలతో మంతనాలు జరుపుతున్నంత ముచ్చటగా వుంది..!
మత్తకోకిలలతో మావిచిగురులు కబురులాడుతున్నంత చిత్రంగా వుంది..!
వసంతవిలాసానికి క్రొత్త అందాలు దిద్దుతున్నంత రమ్యంగా వుంది..!
అసలు చెలిమి రహస్యాలను మది నింపే వెన్నెలవానలా వుంది..!
పరమాద్భుత లోకాలను కనువిందు చేస్తున్నంత కులాసాగా వుంది..!
సరసరాగ కవితావనసీమలలోకి ఈచిన్ని హృదయాన్ని..
వేలు పట్టి నడిపించడంలా వుంది..!
అవిరామామృత పుష్పవృష్టిని నా నిశ్చల సమాధి ఇటుకలపై..
అలా అలా......కమనీయ ప్రేమలేఖలా...!

