ప్రేమ ప్రయాణం
ప్రేమ ప్రయాణం
పరిచయం
నీ పరిచయం
నిత్య నూతన యవ్వనం
పారిజాత సుగంధాల పరిమళం
మనసుకు అద్దెను మురిపెం
అలుపే ఎరుగని సాంగత్యం
ఎవరికీ వరించని అదృష్టం
నాకే నాకే సొంతం
మాయని మమతానురాగం
మనకే మనకే పరిమితం
అల్లుకుంది అందమైన జీవితం
పెనవేసింది విడదీయరాని అనుబంధం
మన అన్యోన్యం శాశ్వతం
ఇరు హృదయాల కలలయికే సాక్షం
నేనున్నానని ఒకరి కొకరి ఆత్మస్థైర్యం
అరమరికలు లేని అమృత బాంఢం
ఎల్లలెరుగని ప్రేమ ప్రవాహాం
నాకు నీవుగా నీకు నేనుగా
సాగిద్దాం చివర క్షణం వరకూ
మన ఈ ప్రేమ ప్రయాణం !!

