రాతిరి చందురుడే పగటి సూరీడు
రాతిరి చందురుడే పగటి సూరీడు
హమ్మయ్య
ఇప్పటికి దొరికావ్
రోజూ ఇద్దరనుకుంటున్నా
అవునండీ
రాతిరి చందురుడే పగటి సూరీడు
నాకెలా తెలుసు అంటారా
పొద్దున్నే తొందరగా లేస్తే మీకే తెలుస్తుంది
చందురుడు మెల్లిగా మేఘాల్లో కలిసి
సముద్రంలో స్నానం చేసి
మండే బట్టలు వేసుకుని సూరీడులా వచ్చేస్తాడు
అంతే..