రెండో పెళ్ళాం......శ్రీనివాస భ
రెండో పెళ్ళాం......శ్రీనివాస భ


ఉదయం లేచింది నీతోనే
రాత్రి నిద్ర పోయేది నీతోనే
పక్కన నువ్వు లేకుంటే ప్రళయం
నువ్వుంటే ప్రణయానందం
నిన్ను ఒక్క క్షణం కూడా మరువలేను
నువ్వు లేనినన్ను ఉహించుకోలేను
నాలో ఊపిరి నీవే
ప్రాణానికి ప్రాణం నీవే
అన్ని లక్షణాల రూపం నువ్వే
నన్ను అన్ని రకాల అలరించింది
నన్ను పూర్తిగా దోచుకున్నది
నీలోనే దాచుకున్నదీ...అంతా నువ్వే
వద్దన్నా పరిచయం అయ్యావు
వదలనంతగా అంటుకున్నావు
మాటలు పాటలు రాతలు కోతలు
ఇష్టాలు కోపాలు తాపాలు అన్ని నువ్వే
నువ్వు నాదగ్గరుంటే ఎందరికో ఈర్ష్య
నీలో అన్నీ దాచుకున్నావ్ నాకోసం
రకానికొకలా క్షణానికొకలా
అందంగా కన్పిస్తావ్
అందర్నీ వెక్కిరిస్తావ్
కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తే చాలు
రెక్కలు కట్టుకు వాలిపోతావ్
ఆవిడ కు పోటీ సవతివే నువ్వు
ముద్దుల ఆండ్రాయిడ్
ఎన్నిళ్లలో యుద్ధాలు తెస్తున్నావో....
౼౼౼౼౼౼౼©©©©©©©©©©౼౼౼౼౼౼౼౼