STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Comedy

4  

Venkata Rama Seshu Nandagiri

Comedy

భార్యామణి

భార్యామణి

1 min
308

పాడుతోంది భార్య , ఆనందమానందమాయెనే,

అదిచూసిన భర్త , ఇంత ఉదయాన్నే నీకేమాయనే.

చేర్చాడు అతను, ఆమెపాటకు తన పల్లవిని,

చెప్పను గదా, నాఆనందానికి కారణమేమని,

మరింతగా భర్తను ఊరించిందామె, ఆటపట్టిస్తూ

పుస్తకమొకటి దొరికింది, నాఅదృష్టం మార్చేస్తూ

పరవశించింది చూడగనే నామనసు, ఆనందంతో

ఆఒక్క పుస్తక మొక్కటి, నేర్పించింది నాకెంతో.

ప్రసాదించింది నాకది, నేకోరిన చీరలు, నగలు

మహాలక్ష్మి నాపాలికది, దానికే చేస్తా ఇక పూజలు.

చూడలేదు ఇంతటి సౌభాగ్య దాతను మరెక్కడా

చెప్పుకోండి, అదేమిటో, దొరికారుగా మీరిక్కడా.

జుట్టు పీక్కున్నా అర్థం కాలేదా మహానుభావుడికి

చెప్పవే ఇప్పటికైనా, నా బీపీ పెంచకే ఓ నా తాటకి.

ప్రాథేయపడ్డాడు భర్తగారు, ఏమనలేక‌ భార్యామణిని

దొరికిందిగా మీ చెక్కుబుక్కు , నిండు సంతకాలతో,

తీర్చుకున్నా , మీరు తీర్చని నా కోరికలన్నీ దానితో.

వచ్చింది పాపమతనికి బీపీ తో పాటు గుండె మంట

భార్యామణి కోరికల జ్వాల, అతని గుండెకు సోకిందంట.


Rate this content
Log in

Similar telugu poem from Comedy