నీ నవ్వుల జాడ
నీ నవ్వుల జాడ
మనసుమాయ వదిలించును..నీ నవ్వుల వాడ..!
చూచుతీరు నేర్పించును..నీ చూపుల తోట..!
ప్రేమవిలువ తేల్చగల్గు..భాషన్నది ఏది..
అసలుచెలిమి పండించును..నీ వలపుల వాన..!
ఒక్కమాట అవసరమే..లేనిచోట శాంతి..
అదే కదా అందమైన..నీ సొగసుల మేడ..!
అబద్ధాలు నిజమేలే..ఆపదలో తోడు..
చూడలేని ఇటుకలంటి..నీ తలపుల గోడ..!
ఊహలన్ని పరిమళించు..గులాబీలు ఇపుడు..
నా మానస కోకిలమది..నీ ఊసుల పాట..!
నాట్యమాడు మయూరమై..ఆలోచన నిలిచె..
పెదవులింట చిత్రముగా..నీ పదముల ఊట..!

