STORYMIRROR

Midhun babu

Comedy Classics Others

4  

Midhun babu

Comedy Classics Others

భలే తమాషాగా

భలే తమాషాగా

1 min
251

విరహానికి వీడ్కోలు చెప్పేద్దాము,

బోడిగుండుకు మల్లెమాల పెట్టేద్దాము,

మనసైన వినోదానికి

చెదరని చిరునవ్వే

కానుక చేసేద్దాము.


విచిత్రమౌ ఆలోచనలో

 కబుర్లేన్నో వినేద్దాము,

ఊరించు ఊహను కథగా మలిచేద్దాము,

మదిలో మెదిలే తలపుకు పసిడివన్నెలు దిద్దేద్దాము,

తీయని సొగసుల

పరిమళ వేడుకను

 హృదిలో పదిలం చేసేద్దాము.


ఆరబోయలేని కురులలో

అందాల అనురాగాన్ని చూసేద్దాము,

తమాషా మనసుతో

ఆశలకోర్కెల ఊసులను పంచుకుందాము,

అనుబంధపు లోగిలిలో

ప్రేమ విరబూయుటే

భాగ్యంగా భావిద్దాము,

వింతగొలిపే బుద్దితో

పరవశాల విందులే చేసుకుందాము


Rate this content
Log in

Similar telugu poem from Comedy