STORYMIRROR

Ramesh Babu Kommineni

Comedy Drama

4  

Ramesh Babu Kommineni

Comedy Drama

జిహ్వ చాపల్యం

జిహ్వ చాపల్యం

1 min
795

ప౹౹

ఇష్టమైనదని ఆహారాన్ని అతిగా లాగించకోయి

ఇంపుగా ఉందని ఇహమే మరచి భుజించకోయి ౹2౹


చ౹౹

అతి సర్వత్రా వర్జియేత్ వర్తించునూ దీనికికూడ

మితిగానూ స్వీకరించు సాపాటు ఎప్పుడుకూడ ౹2౹

అన్ని పదార్థాలనూ మక్కువతనే ఆరగించరాదా

కొన్నిటినే తినాలను కోరిక ఉపసంహరించరాదా ౹ప౹


చ౹౹

ఆరు ఋతువులున్నా ప్రాధాన్యమేలా శశిరానికి

ఆరు రుచులు చాలా అవసరమేలే ఈ శరీరానికీ ౹2౹

అన్ని వంటకాలు అంతే అవసరము ఈదేహానికి

సాగిలపడకోయి కొన్నిటీనే కోరే కోరికా దాహానికి ౹ప౹


చ౹౹

వంకాయ శాకమే ఇచ్చగానూ తిన్నాగ ఒకనాడు

వంకలేక వండేసిన వాటినే తింటున్నా ఈనాడు ౹2౹

ఆ జ్ఞాపకాలను వర్ణించలేనే అదేపనిగా అడిగినా

ఏ రూపకాలను ప్రదర్శించగలేను ఎలా తడివినా


Rate this content
Log in

Similar telugu poem from Comedy