మోసం - దగా
మోసం - దగా


జిలుగు వెలుగుల కాగితంతో
అట్ట పెట్టెల అందంతో
రా.. రమ్మని ఆకర్షిస్తాయి
కొనమని ప్రేరేపిస్తాయి
సినీ తారల ముచ్చట్లతో..
చిత్ర, విచిత్ర పదజాలంతో..
ఉప్పు నుండి ఊరగాయల వరకూ..
కంది పప్పు నుండి కార్ల వరకూ..
చేతి రుమాలు నుండి చీరల వరకూ..
మాత్రల నుండి యాత్రల వరకూ..
ప్రకటనల జోరుతో హోరెత్తిస్తాయి
అట్టపెట్టెల అందమే గాని..
సరుకు నాణ్యత
పైన పటారం.. లోన లొటారం..
తాము అమ్మే సరుకు
తాజా అంటారు
నిల్వ కొరకై రసాయన
విషం చల్లుతారు
పురుగు మందుల అవశేషాలతో ప్రతి పదార్ధం కలుషితమే!
ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ..
మన నెత్తిన కుచ్చుటోపీ పెట్ట జూస్తారు
ప్రోటీనులు, విటమిన్లు పుష్కలమంటూ..
ప్యాకెట్లపై మీదరిస్తారు
అది మాత్రం...
మైసూరు బొండాలో మైసూరు చందమే!
కంటికి అనని అక్షరాలతో
టెర్ములు, కండీషన్లంటూ..
మోసబుచ్చి కట్టబెడతారు
దగా పడి కోర్టుకెళితే
మరో కష్టం ఎదురాయె!
ఏం కొనేటట్టు లేదు..
ఏం తినేటట్టు లేదు..
ఏమీ సేతుము రంగా..
ఎట్టా బతికెదము గంగా..
నిండా మునిగేము..
బయటకు రాలేకున్నము..