STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

నేను - నా నిద్దర పంచాయితీ

నేను - నా నిద్దర పంచాయితీ

1 min
386

కళ్ళలో నిజం కనిపిస్తుంది

మాటలో అబద్ధం ధ్వనిస్తుంది

ఆసక్తిలో నిర్లక్ష్యం

అనాసక్తిలో దౌర్బల్యం


అసలీ అలవాట్లున్నాయే

అదే అలవాట్లంటే మరీ చెడ్డవి కావు 

కొంత ద్వేషం నాకు నాపైన

ఇంకొంత మరి కొందరి మీద


అసలు అలవాట్లు ఎందుకుంటాయి

నిద్రపోవడం కూడా అలవాటే కదా

మరెందుకు కుదరట్లేదు 

బహుశా ఇప్పటివరకూ పోయిన నిద్ర చాలనా

లేక నిద్ర రాకుండా రోగమేమైనా వచ్చిందా


ఎవర్ని అడిగినా ఒకటే మాట

నిద్దర రాకపోతే మంచిదేగా

కాసేపు ఎక్కువ పని చెయ్యొచ్చు

కూలి డబ్బులు ఎక్కువొస్తాయి

అవును

కూలి డబ్బులు 

ఆ తాగుబాతు ఎంకటిగాడు కల్లు తాగే డబ్బులు

సుబ్బి కన్ను కొట్టి అడిగే డబ్బులు


నిద్దరపోనివ్వని కూలి డబ్బులు

వార్నీ పాసుగాల ఇప్పుడు తెలిసింది

నిద్దర ఎందుకు రాలేదో



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract