Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Venkata Rama Seshu Nandagiri

Comedy

5  

Venkata Rama Seshu Nandagiri

Comedy

అమ్మాయి అందం

అమ్మాయి అందం

1 min
1.5K


అందంగా ముద్దొచ్చే వనిత వదనారవిందం,

ఎవరినైనా ఆకట్టుకొనే ఆ చంద్రముఖి అందం.

ముత్యాల వలె మెరిసే చక్కని దంతపక్తి ద్వయం,

ఏ పేస్టు తో చేయునో, మరి ఆమె దంతధావనం!

దొండపండ్ల మెరుపుతో నిండిన పెదాలు గల ఇంతి,

పెదాలకు ఏమి పూయగ వచ్చునో, ఆ వింత కాంతి!

నిడుపైన ముక్కును దాచిన గుండ్రని ఊలు బంతి,

గాలి పీల్చుటకు ఏమి చేయునో మరి ఆ పడతి!

ఆనందం తోనో, ఆశ్చర్యం తోనో విప్పారిన నేత్రాలు,

ఏ సందేశం, ఎవరికి ఇచ్చుచున్నవో ఆమె కనులు!

ఎవరిని చూచి ఆనందంతో తబ్బిబ్బాయెనో ఆ మోము,

ఓ సుదతీ వారికి స్పష్టముగ కన్పడనివ్వు నీ వదనము.

నిన్ను చూసిన పెద్దలు చిరునవ్వులు దాచగలేరు,

పిల్లలు కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తపరచేరు.

అందరినీ నవ్వులతో ముంచెత్తే నీ ఈ ఆహార్యం,

ఎవరికి అంతుపట్టును, దాని వెనుకగల నీ ఆంతర్యం


Rate this content
Log in

Similar telugu poem from Comedy