తిరస్కరణ
తిరస్కరణ
అతణ్ణి ఒంటరిగా వదిలేసారు అంతా
ఉదయం నుండీ ఇల్లొదిలి ఒక్కక్కరే
జారుకుంటున్నారు చల్లగా ఏదో ఒకటి చెప్పి
నిశ్శబ్దంగా వెళ్లిపోతున్నారు
బయటికెళ్ళాకా విమర్శిస్తున్నారు
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఆ మూర్ఖులు
ఓదార్చుతారని భావించిన ఆ అమాయకుణ్ణి
బలవంతంగా ఒదిలించుకుంటున్నారు
నువ్వొద్దు అనుకుంటూ, వెచ్చని ఆ కరచాలనాన్ని సున్నితంగా విదిలించుకుంటూ
సున్నితంగా అక్కడినుండి జారుకుంటున్నారు.
అతనిలో శక్తి ఉన్నంత కాలం...
సాధ్యమైనంత ఎక్కువ శ్రమ చేసి వాళ్ళని గౌరవించాడు
నావాళ్ళు అంటూ తనని ఆదుకుంటారని భ్రమసాడు
జీవితంలో ఏదీ శాశ్వతం కాదంటూ శక్తి ఉడిగిపోతుంటే
నీతో ఉండడం నా వల్ల కాదంటూ భార్య, పిల్లలు
తమదారి తాము చూసుకున్నారు...
రెక్కలు తెగిన ఒంటరి పక్షిలాంటి ఆ అమాయకుడు చేతులు జోడించి ప్రార్థించినా తిరస్కరణకే గురైనాడు.