STORYMIRROR

gopal krishna

Romance Classics Fantasy

4  

gopal krishna

Romance Classics Fantasy

చెప్పవా చిన్నమాట...

చెప్పవా చిన్నమాట...

1 min
352

నువ్విష్టపడే నీలి సముద్రం ఒడ్డున

నీలాకాశం లో అస్తమిస్తున్న సూర్యుడు

నాకు నిన్నిచ్చేసి జాగ్రత్త అంటూ చెప్తూ ఉంటే

సముద్రపుటొడ్డున గుప్పెళ్లతో ఇసుకను తీసి ఆడుకుంటున్న నువ్వు, లోకాన్నే మరిచిపోయి ఆరాధనగా నిన్ను చూస్తూ, గాలికెగురుతున్న నీ ముంగురులను సవరించుదామని అనుకుంటే, సిగ్గుతో ముడుచుకుపోయావు

ఈసముద్రం మనిద్దరినీ మరింత దగ్గర చేసిందని నేనంటే, నవ్వేసి ఊరుకున్నావు

నీ కన్నుల్లో కాంతిరేఖలు చెప్తున్నాయి నేను చెప్పింది నిజమే అని,

 ఇంతకీ నన్నిప్పుడేం చేయమంటావ్!!

నీ కన్నుల్లో కాంతి రేఖలను తదేకంగా చూడమంటావా,

గాలికి ఎగురుతూ నీ మొహం మీద నర్తించే ముంగురులను చూస్తూ కవితలు రాయమంటావా!!

నీ నుండి వీచే చిరుగాలులు రహస్యంగా చెప్పే

నీ హృదయాంతర భావాలను వింటూ పరవశించమంటావా....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance