వెన్నెల్లో ఆ అమ్మాయి
వెన్నెల్లో ఆ అమ్మాయి
వెండి అంచున్న నీలి అలల లాంటి చీర చుట్టుకుని,
తలారా స్నానమాడి, కురులను గాలికి వదిలి
వయ్యారంగా నడిచి వచ్చి, నా పక్కన కూర్చుంది
చిరునవ్వులు చిందిస్తూ...
పున్నమి వెన్నెలను ఆస్వాదిస్తున్న నన్ను చూసి మనోహరంగా నవ్వింది అందమైన తన కళ్ళతోనే....
తన్మయావస్థ లో కూర్చొని తదేకంగా తననే చూస్తున్న నన్ను కళ్ళతోనే పలకరించింది.
సువాసనలు వెదజల్లుతున్న ఆమె మేను
చిత్రంగా తళుకులీనుతోంది...
నల్ల మబ్బుల వంటి తన కేశాలను సవరించుకుని, పచ్చని గడ్డిలో ఒత్తిగిలి, పడుకొని రా రమ్మని ఆహ్వానిస్తోంది.
వణుకుతున్న అధరాలతో, నన్ను చేరి తన ఆధారామృతాన్ని గ్రోలమని అందించింది.
నా ఒడిలో చేరి అల్లరి చేసి అలిసిపోయింది
కమ్మని కల చెదిరింది,....
మందస్మిత వదనం తో ఆమె మాయమైపోయింది

