మనకోసం మనం.....
మనకోసం మనం.....
కాసేపు మనల్ని గురించి మనం మాట్లాడుకుందాం
ఈ ప్రపంచంలోని అన్ని బంధాలకు దూరంగా...
కాసేపు మన మనసులోని ఆలోచనల్ని ఒకరితో ఒకరం పంచుకుందాం
అందరి ఊసులను పక్కన పెట్టి.....
కాసేపు నీలివర్ణ ఆకాశంలో రంగుల హరివిల్లుపై ఆటలాడుకుందాం
ఈ ప్రపంచంలో మన బాధ్యతల్ని మరిచి.....
ఒక్కసారి ఈ ముసుగులన్నింటిని తీసి
మనకి మనమే నగ్నంగా నిలబడదాం
మన మనసులోపలి పొరల్ని తవ్వడానికి.....
కాసేపు మనం మనకోసమే గడుపుదాం
మనకోసం మాత్రమే చర్చిద్దాం.....
మనం మనలాగా ఉండాలంటే ఎలా ఉండాలో
ఒక్కసారి చర్చిద్దాం.....
ఒక్కసారి మనకోసమే మనం ఆలోచిద్దాం మనం ఎవరిమని మన అంతరాత్మని అడుగుదాం.....
పచ్చి నిజల్ని వెలికితీద్దాం... అది కష్టమైనా ఇష్టమైనా... వాటిని ఆస్వాదిద్దాం మనస్ఫూర్తిగా....
మన వెంట తిరుగుతున్న ఈ బంధాలు, అనుబంధాలనే నీడల్ని ప్రశ్నిద్దాం...
ఒక్కసారైనా మాకోసం ఏం చేసారని....
నకిలీ మనుషుల్ని, నకిలీ ప్రేమానుబంధాల్ని
ఒక్కసారిగా కట్టగట్టి గంగలో కలిపేసి
పునీతులమై.... అగ్నిశిఖల్లా ప్రజ్వరిల్లుదాం
మన ఆశయాలకోసం, మన ఆలోచనలకోసం
కుండబద్ధలు కొట్టి నిర్మొహమాటంగా మాట్లాడుదాం....

