లలన.....
లలన.....
విశాలమైన రావి చెట్టుకింద చల్లని నీడ కోసం కూర్చుని, నండూరి వారి ఎంకిపాటలు వింటూరాబర్ట్ ఫ్రొస్ట్ కవితల్లోని పున్నమి నాటి అడవుల్ని తల్చుకుంటూమండుటెండనే పున్నమి వెన్నెల్లా భావిస్తూ,కీట్స్ కవితల్ని, షేక్స్పియర్ సోనెట్ లతో కలగలిపి, కొత్త ఆలోచనలు రేకెత్తుతూ ఉంటే మొహమ్మీద పడుతున్న భానుని కిరణాల లోని ప్రకాశవంతమైన కాంతి నుండి కళ్ళను కాపాడుకుంటూవిశ్వనాధ వారి కిన్నెరసానిలా హొయలు పోతూ నేలకు చేరుతున్న ఆకుల్ని చూస్తూ,చిక్కని చిరునవ్వుల్ని చిందించే వడ్డాది పాపయ్య గారి చందమామ బొమ్మలాంటి అమ్మాయిని చూస్తూ ఉంటే, మతి చలించిఆమెతో సంభాషిస్తే బావుండుననుకునే వేళకోరికలు గుర్రాలై పరుగులు తీస్తున్నట్లున్నాయి నా హృదయ గవక్షాలు, బార్లా తెరిచి కలువకన్నుల లలన కోసం వేచి చూస్తున్నా

