STORYMIRROR

gopal krishna

Romance Classics Fantasy

4  

gopal krishna

Romance Classics Fantasy

మౌనం

మౌనం

1 min
269

నీలి సముద్రపుటొడ్డున, సాయం సమయాన

ఇసుక తీరాన, నేనూ తానూ...

ఒకరినొకరం చూసుకుంటూ..

కళ్ళతోనే ఒకరినొకరు ఆప్యాయంగా తేరిపార చూసుకున్నాం

కళ్ళతోనే మనసుల్ని తడిమి పలకరించుకున్నాం...

నీటి ఒడ్డున కాళ్ళు తడిసేలా కూర్చొని ఆలోచనల్ని ఆరబెట్టుకున్నాం..

అసలు మేము ఒక్క ముక్కా మాట్లాడుకోలేదు....

క్షణాలు, గంటలు ఎన్ని గడిచిపోయాయో తెలియలేదు......

కాలం ఎలా పరిగెడుతోందో చూసుకోనే లేదు

మా మధ్య మౌనం... అలా సాగిపోతూనే ఉంది

అందమైన ఆమె కళ్ళు... గుండ్రంగా తిరుగుతూ

ఎక్కడెక్కడో స్పృశిస్తున్నాయి నా మేనిని

నా కళ్ళు ఆమె అంతరంగాన్ని అంచనా వేస్తున్నాయి

రెండుజతల కళ్ళు... రెండుమనసుల్లో ఆలోచనలు

ఒకదానితో ఒకటి పోటీపడి మరీ పెనవేసుకున్నాయి

మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం...ప్రేమించుకుంటున్నాం అనే పనికిరాని మాటలకన్నా...

గొప్పలు చెప్పుకోవడం కన్నా.....

అసలు మాటలు లేకుండా మౌనంగా ఉండడమే....

నిజమైన, అలౌకికమైన స్నేహాభావం...

చల్లని కృత్రిమ నవ్వుల పలకరింపుకన్నా...

భేషజాలు లేని మౌనపు పాలకరింపే మేలు....

ఆ మౌనమే మనసుపొరల్లోని మంచితనమనే

సున్నితమైన నవనీతం లాంటి స్నేహాభావాన్ని

వెలికితీస్తుంది... అందుకే మౌనపు పలకరింపే గొప్పది.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance