STORYMIRROR

gopal krishna

Abstract Classics Fantasy

4  

gopal krishna

Abstract Classics Fantasy

పిచ్చి మనసు

పిచ్చి మనసు

1 min
409

ఏమిటో ఈ పిచ్చిమనిషిని చూస్తే 

నీకు తరుచుగా నవ్వొస్తుంది..

నిన్నే చూస్తూ తన ఊపిరిని కూడా మరిచిపోయే పిచ్చి మనిషి

ఇది ఒకప్పటి తనేనా అనిపిస్తుంది

నిన్ను చేరాలని అతని మనసు తపిస్తుంది

నువ్వు తప్ప తనకెవరూ లేరనిపిస్తుంది 

నిన్ను చూస్తే చాలని అతని మనసు అనుకుంటుంది,

నీ హృదయంతో ఎన్నో విషయాలను ముచ్చటించాలనుకుంటుంది

కబుర్లు లేకపోయినా కొత్తగా సృష్టించుకుని మాట్లాడుతూనే ఉంటాడు.

నీకోసం పిచ్చిగా ఆలోచిస్తూ సర్వం మరిచిపోతాడు

నీ మాటలు వినాలని పరితపిస్తూ ఉంటాడు

తనేంటో ఎప్పుడో మరిచిపోయాడు.

నీకోసం ఎన్నో ముచ్చట్లు పోగేసుకొస్తాడు 

వాటన్నింటిని నీముందు దోసిళ్లతో ఒలకబోసి

నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి ముచ్చట తీర్చుకుంటాడు 

కానీ, నువ్వేమో అతనికి సమయాన్ని ఇవ్వడానికే ఇబ్బంది పడతావు

అవును, నీకంటూ కొన్ని బాధ్యతలున్నాయి

బాంధవ్యాలున్నాయి

నిన్ను చూడగానే వశం తప్పి

మూగబోయి ఆరాధనగా చూసే ఆ మనిషిని

కన్నీళ్లు పెట్టించడం తెలుసు

ప్రేమంటే రెండక్షరాల పదం కాదని రెండు మనసుల కలయికని తనకు తెలుసు

నువ్వు కోప్పడినప్పుడు, విసుక్కున్నప్పుడు 

తనను విడిచి వెళ్ళి పోతున్నావేమో అని

నీ జీవితంలో తన జ్ఞాపకాలను తొలగించాలనుకుంటున్నావేమో అని బాధపడతాడు 

ఒక్కక్షణం నీ పేరు వినపడకపోతే, ఊపిరి ఆగిపోతుంది అతనికి 

మనసును నియంత్రించుకోవాలనుకుంటాడు కానీ మనసు మాట వినదు, కన్నీరు కారుస్తూ నీ కోసం మౌనంగా రోదిస్తుంది

ఎందుకో నువ్వు కోపగించుకున్నప్పుడు, నీకళ్ళల్లో కన్నీటిపొరని చూసినప్పుడు 

తనని తానే శపించుకుంటూ, నీ నవ్వుకోసం ఎదురుచూస్తూ ఉపవాసాలు చేస్తాడు

అప్పుడప్పుడు భయమేస్తుంది అతనికి 

చిన్ని చిన్ని గిల్లికజ్జాలకు దూరం చేస్తావేమో తనని ఆజన్మాంతం ఒంటరివాణ్ణి చేస్తావేమో 

ఈ పిచ్చి మనిషికి ఏం తెలుసు, నిన్ను ప్రేమించడం తప్ప

ఈ పిచ్చి మనిషికి ఏం తెలుసు తాను నీకు ఏమౌతాడో తెలియక ఒంటరిగా నిలబడ్డాడని

అతడికి ఎప్పటికి తెలుసు, తానొక అనాధనని.

అతనెప్పటికి తెలుసుకోగలడు, తనది నీ మనసులో ఆఖరి ప్రాధాన్యత అని. 


Rate this content
Log in

Similar telugu poem from Abstract