STORYMIRROR

gopal krishna

Tragedy Classics Fantasy

4  

gopal krishna

Tragedy Classics Fantasy

వెళ్ళిపోకు... నేస్తమా!!

వెళ్ళిపోకు... నేస్తమా!!

1 min
311

నాలో నన్ను నేను మౌనంగా చూసుకుంటున్నప్పుడు

బాధగా నాలో నేనే మాట్లాడుకుంటున్నప్పుడు

నాకు తెలీకుండానే భయంతో వణికించే నిశ్శబ్దం

హఠాత్తుగా నా మీదికి దూసుకొచ్చే నీ రాక

తెలీని నిస్సత్తువను దూరంగా తరిమేసింది ఒక్కసారి

నన్ను నేను క్షణంపాటు మరిచిపోయి రెప్పార్పకుండా

నిన్నే చూస్తూ నిలబడ్డాను సంభ్రమాశ్చర్యాలతో

నా వెంటే నువ్వు అనే పిచ్చి భ్రమ నాది

నాకు రక్షణ కల్పించగలవనే గుడ్డి నమ్మకం నాది

నా మనసులో భావాలే నాకు అవగతం కానప్పుడు

నిన్నెలా నేను అవగాహన చేసుకోగలను?

నీ ఆలోచనలే నాకు కొండంత బలాన్నిచ్చి ముందుకు నడిపిస్తున్నాయి

వెళ్లకు..... ఇక్కడినుండి

వెళ్తూ వెళ్తూ శపించి ముందుకు సాగకు

నాలో నా మౌనాన్ని నాలోనే సమాధి చేయనివ్వు

ఉదయాన్నే నీకు చెప్పే ఉషోదయపు శుభాకాంక్షలు

చెప్పడానికి ఎవరూ లేనప్పుడు గుండెల్లో కలిగే వేదన

ఆ వేదనకు కారణమేంటో? మౌనంగా ఉన్న మనసు నడుగు 



Rate this content
Log in

Similar telugu poem from Tragedy