STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Comedy Classics Thriller

4  

Thorlapati Raju(రాజ్)

Comedy Classics Thriller

రహస్య జీవితాల్!

రహస్య జీవితాల్!

1 min
367


మొబైల్... ఓ మొబైల్!

శ్వాస లేని చోట కూడా...

నీ ధ్యాసే నంటే ఏమని చెప్పాలి

నీ...మహిమల్!


ఏ ముహూర్తాన మలిచారో నిన్ను

ఆ నాటి నుండి నువొక కిక్కిచ్చే...

కాక్ టెయిల్!

అంచనాలకందని వేగంతో...

దూసుకొచ్చిన మిస్సైల్!


ఒక్క క్షణం మ్రోగకపోతే..

నీ.. ట్రింగ్ ట్రింగ్ బెల్!

గుండెలన్నీ అబ్బో..గుబుల్ గుబుల్!

పిచ్చెక్కిపోతారు...జనాల్!


ముందు అనుకుంటాం అంతా...

నువొక..... ట్రైల్!

తరువాత రోజూ చేస్తూ ఉండాలి.. డైల్!


చిత్ర విచిత్రాలు చూపి...

చేస్తావు....థ్రిల్!

ప్రపంచాన్ని చేతికిచ్చి...

అందర్నీ చేశావ్.... ఫూల్!


అలవాటు చేశావ్ అందరకీ...

రహస్య జీవితాల్!

కలిసి మెలిసి ఉన్న...

మనసుల మధ్య ...

వేసావ్.... గ్రిల్!

నరాల్లో జీర్నింప జేశావ్...

ప్రతీది...తత్కాల్!


చూడ్డానికి నువ్వెంతో...లిటిల్

వాడాక తెలుస్తుంది..

నువ్వు పేల్చే.... బిల్!


మూత్రశాలలైనా లేనిచోట...

వేసావు..నీ..మూల స్తంభాల్


Jio.. voda...airtel

Idea..reliance.. bsnl

వలపని (network) ఏదైనా...

వలపన్ని చేస్తావ్ మోసాల్!


చేస్తావ్ మా విలువైన..

సమయాన్నంతా... కిల్!


వ్యాపారికి మాత్రం...

కోట్లలో లాభాల్!


ఓ మొబైల్📱...

ఇదే...నువ్వు చేసిన కమాల్!

తెలుసుకోకపోతే 

మా జీవితాల్...ఢమాల్!


   .....రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Comedy