STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

సెలవు - ఒక అబద్ధం

సెలవు - ఒక అబద్ధం

1 min
322

చెమటలు పట్టేస్తాయి

చేబదుళ్ళూ గుర్తుకు వస్తాయి

పెండింగ్ పనులు దెప్పుతాయి

అద్దాల్లోంచి చూపులు చురుక్కుమంటాయి


అదేంటో

రోజూ వెళ్ళే ఆఫీసే

సెలవు అంటే మాత్రం ఒప్పుకోదు


మడిసన్నాక కూసింత కలాపోషణ ఉండాలన్న సంగతేమో కానీ

కాస్త వ్యక్తిగత విషయాలకి సెలవు పెట్టాలంటే 

ఎన్ని అప్పగింతలు

ఎన్ని మూతి తిప్పడాలు


అందుకే 

సెలవు కోసం అబద్ధం చెప్పడం తప్పులేదనిపిస్తుంది

లేదంటే సెలవు అనేదే అబద్ధమయిపోతుంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract