STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Romance

4  

Dinakar Reddy

Abstract Comedy Romance

నువ్వంటే పిచ్చహే

నువ్వంటే పిచ్చహే

1 min
343

పతీ శుక్రవారం కొత్త సినిమా వస్తది

కానీ అన్ని సినిమాలూ సూపర్ హిట్టు కావు

అట్లనే లైఫ్ లోకి ఎందరో వస్తరు

ఏమేమో చెప్తరు

కానీ నువ్వట్టా గాదు

నీ తీరట్టా గాదు


ఇళయరాజా ట్యూన్లాగా

ఉప్మా పెసరట్టులాగా

అమ్మ చేతిముద్దలాగా

నాన్న తిట్టే తిట్లలాగా

ఆదివారం నిద్రలాగా


నువ్వూ నీ మాటలు

నీ నవ్వులూ చూపులూ

నీ అవులాయి 

అదేనోయ్ నీ అత్తి పనులు

ఇలా నీకు సంబంధించింది ఏదీ నాకు బోర్ కొట్టదబ్బా

అన్నీ స్పెషలహే

నువ్వంటే నాకు పిచ్చహే


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract