STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Romance

4  

Dinakar Reddy

Abstract Comedy Romance

చివుక్కుమంది

చివుక్కుమంది

1 min
322

నా తెల్ల వెంట్రుకల్ని నువ్వు చూపించినప్పుడు

నా మీసాలు పట్టుకుని లాగినప్పుడు

నాకెక్కడో చివుక్కుమంది

ఎప్పుడూ అంతే

నువ్వు నాకు చిక్కకుండా పరిగెత్తినప్పుడు

నీ తానాల గదిలోకి నే తొంగి చూసినప్పుడు 

ఎప్పుడూ అంతే


తాకితే అందేంత దూరంలో నువ్వు

అయినా నాకు దక్కనంటున్న నీ వలపు

నచ్చినా ఒప్పుకోవు

ఆ ఒక్కటీ దక్కనీవు

ఊరిస్తావు ఉడికిస్తావు

పెదాల రంగుని ఎర వేస్తావు


ఒళ్ళు జలదరించేట్లు కావులిస్తావు

నే కాస్త ముందుకు వస్తే ఇంక చాలని ఆవులిస్తావు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract