STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

ఒక ఎంపిక

ఒక ఎంపిక

1 min
329

అర్థం లేని ఆలోచనలు

నిరర్థకం అనిపించే వ్యాఖ్యలు

ఎందుకు అనే దేహాల సందేహాలు

ప్రశ్నలు వింటిని వీడిన బాణాలు


అంతటా నువ్వే కనిపిస్తుంటే

ఆకాశగంగ పాలపుంతను నీ నవ్వుల పలువరుస ఆక్రమిస్తుంటే

నేనొక నిర్ణయం తీసుకున్నాను

నిద్రా భంగిమను మార్చి 

ప్రేమకూ కోరికకూ మధ్య

ఒక ఎంపిక చేసుకున్నాను 


అరుణారుణ కాంతులు నన్ను తాకాయి

కొత్త విశ్వం ఒకటి ఉద్భవిస్తోంది 

నువ్వు లేని ఆ లోకంలో నేనే ప్రేమను

సమస్త కోరికల రూపాన్ని కూడా నేనే 


ఇక ఈ సంతోషానికి అవధులు లేవు

అరే

కరెంటు పోయినట్టుంది

కొత్త లోకంలో కూడా

ఏదో కుడుతోంది

ఇక్కడ కూడా దోమలున్నాయేంది

నా కొత్త విశ్వం ఏమైంది!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract