STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Comedy Drama Tragedy

5.0  

Thorlapati Raju(రాజ్)

Comedy Drama Tragedy

20-20!

20-20!

1 min
355

2020...


ఎప్పుడొచ్చావో..

ఎందుకొచ్చావో..

ఏమ్ చేశావో..

మాకు ఏమిచ్చావో!

కోడ్తే..దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది!

అన్నట్టుగా..

తెలియని అయోమయంలో పడేసావు!


పేరుకు తగ్గట్టుగా...

20-20 అంత ఫాస్ట్ గా ముగించేసావేమో

కానీ!

20-20 match అంతటి..

Excitement లు..

Twist లు..

అంతకుమించి టెన్షన్లు...

మాత్రం అందరికీ ఇచ్చావు!


ఇంతకాలం..

మా ఆట మేమే ఆడుతున్నాం!

అనుకొని భ్రమలో బతికేసాము

కానీ!

కాలమనే..

20-20 నీ నువ్వే ఆడిస్తున్నావ్ ..

అని గ్రహించ లేక పోయాం!


బౌలింగ్ చేసేది...

పేసర్ అయినా

స్పిన్నర్ అయినా..ఆడేయవచ్చు!

కానీ!

నువ్వు పిచ్ నే..

కనికరం లేని కరోనా తో చేశావే!


ఇంక బంతి ఎప్పుడు తిరుగుతుందో..

ఎక్కడ తగులుతుందో..తెలియకే!

ఎంతో మంది బరియల్ గ్రౌండ్ కెళ్ళిపోయారు

అక్కడైతే..ఆటాడాల్సిన పనే లేదని!


ఇంకా పిచ్ పైనే ఉన్న మేము

 ఔట్ ఓ.. నాట్ అవుట్ ఓ కూడా..

తెలియని అచేతన స్థితిలో ఉన్నాం!


ఓ..20-20

నువ్వు తయారు చేసిన పిచ్ బారిన పడ్డ..

పిల్లలైతే పీఠ భూమి స్థితికి వెళ్ళిపోయారు

పెద్దలేమో..

పిచ్ రిపోర్ట్ ని అంచనా వేయలేక..

శాశ్వతంగా...పడుకుండి పోయారు


ఓ 20-20..

నీవు తీసుకొచ్చిన కరోనా..

ప్రతి ఇంట్లో విషాదం తెచ్చింది

ప్రతి మనసులో అగాధం మిగిల్చింది

ప్రతి కన్ను కన్నీరు కార్చింది

ప్రతి గుండె గాయమైంది


అందుకే.. ఓ 20-20

ఎవరైనా ఇంటినుండి వెళ్తే...

పోయి రావమ్మా అంటాం

కానీ!

నిన్ను మాత్రం...

పోయి..ఇక రాకమ్మా!

అని పొర్లు దండాలు పెడుతున్నాం!


Good bye ....20-20!


        .....రాజ్.....





Rate this content
Log in

Similar telugu poem from Comedy