STORYMIRROR

Eevani Ravisankara Sarma

Comedy Romance

4.5  

Eevani Ravisankara Sarma

Comedy Romance

శిధిలమైపోతా !

శిధిలమైపోతా !

1 min
636


నీవులేని లోకంలో సజీవంగా ఏముంది ?

నలువైపులా ఉన్న పూలమొక్కలకు , చెట్లకు

అందంగా పూయుటకు , పరిమళాన్ని వెదజల్లుటకు

సంశయమే కనబడుచున్నది ,

ఎప్పుడూ వయ్యారంగా మెలికలు తిరిగే లతలు

భారంగా తమ తలలు వాల్చుచున్నవి .

వర్షం సుతారంగా కురవక నీవులేవని తెలిసి

ఎడారిని తలపించేలా నిష్ఠూరాన్ని ప్రదర్శిస్తోంది ,

ఎండ నీకెందుకులే పొమ్మని

నన్ను చూడగానే మబ్బుల చాటుకు వెళుతోంది .

జాబిలి నీ నెచ్చెలి ఏదని అడుగుతోంది ,

కులుకుతూ వాలే చిలుక ఏమోయ్ కోపం

తెప్పించావా అని ఆగ్రహిస్తోంది .

నీవు అలకమాని పలుకకుంటే ఇక్కడే శిధిలమైపోతా !

మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రియా ! ,

అప్పుడైనా కనికరిస్తావేమోనని ఇలాగే ఎదురుచూస్తా !!



Rate this content
Log in

Similar telugu poem from Comedy